Andhra Pradesh: కాపులు ఎవ్వరూ టీడీపీని వీడటం లేదు.. చంద్రబాబు వచ్చాక అన్నీ చర్చించుకుందాం అని చెప్పా!: కళా వెంకట్రావు

  • నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీల జంప్
  • తనకు అసలు సమాచారమే లేదన్న ఏపీ టీడీపీ చీఫ్
  • కాపు నేతలతో ఫోన్ లో మాట్లాడానని వెల్లడి

టీడీపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, సీఎం రమేశ్, గరికపాటి రామ్మోహన్ లు తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని సభ చైర్మన్ వెంకయ్యనాయుడికి వినతిపత్రం అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు స్పందించారు. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు పార్టీ మారడంపై తనకు ఎలాంటి సమాచారం లేదని ఆయన అన్నారు.

ఇక కాకినాడలో కాపు నేతల రహస్య భేటీ విషయాన్ని తాను మీడియాలో చూశానని, దీంతో తాను కాపు నేతలకు ఫోన్ చేసి మాట్లాడానని పేర్కొన్నారు. కాపు నేతల్లో ఎవర్వికీ కూడా పార్టీ పట్ల వ్యతిరేకత లేదనీ, వారికి పార్టీ మారే ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్న చంద్రబాబు తిరిగివచ్చాక, అన్ని విషయాలు చర్చించుకుందామని కాపు నేతలతో చెప్పినట్లు పేర్కొన్నారు.

Andhra Pradesh
Telugudesam
KAPU LEADERS
kala venkatarao
joining bjp
  • Loading...

More Telugu News