Rajyasabha: రాజ్యసభ చైర్మన్ కు లేఖ ఇచ్చిన టీడీపీ ఎంపీలు

  • టీడీపీ నుంచి వీడిపోతున్నాం
  • మమ్మల్ని ప్రత్యేక గ్రూప్ గా పరిగణించాలి
  • రాజ్యసభ చైర్మన్ కు లేఖ ఇచ్చిన నలుగురు ఎంపీలు

ఏపీ టీడీపీ రాజ్యసభ ఎంపీలు ఆ పార్టీని వీడనున్నారన్న క్రమంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తమను ప్రత్యేక గ్రూప్ గా పరిగణించాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకి విజ్ఞప్తి చేశారు. కొద్దిసేపటి క్రితం సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్ లు వెంకయ్యనాయుడుని కలిసి ఈ లేఖను అందజేశారు. టీడీపీని విభేదించి బయటకు వచ్చామని, తమను ప్రత్యేక గ్రూప్ గా పరిగణించాలని పేర్కొన్న ఈ లేఖపై నలుగురు ఎంపీలు సంతకాలు చేసినట్టు సమాచారం. రాజ్యసభ చైర్మన్ ఇచ్చిన విందు భేటీకి హాజరైన సమయంలో టీడీపీ ఎంపీలు ఆయనకు ఈ లేఖ ఇచ్చినట్టు తెలుస్తోంది. తమను ఏ పార్టీకీ అనుసంధానమైన గ్రూప్ గా పరిగణించొద్దని ఆ లేఖలో పేర్కొన్నట్టు సమాచారం.

Rajyasabha
venkaiah naidu
Telugudesam
Sujana Chowdary
  • Loading...

More Telugu News