Andhra Pradesh: మరికాసేపట్లో లోక్ సభ స్పీకర్ బిర్లాతో కేశినేని-గల్లా-రామ్మోహన్ నాయుడు భేటీ.. పార్టీ మారుతారని జోరుగా ప్రచారం!

  • బిర్లాతో సమావేశం కానున్న ముగ్గురు ఎంపీలు
  • నలుగురు రాజ్యసభ ఎంపీలు వెళ్లేందుకు రంగం ఖరారు
  • లోక్ సభ ఎంపీల ఫిరాయింపు వార్తలను ఖండించిన టీడీపీ

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్ బీజేపీలో చేరనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన ముగ్గురు లోక్ సభ సభ్యులు గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు ఈరోజు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశం కానున్నారు.

ఈ ముగ్గురు లోక్ సభ సభ్యులు ఈరోజు సాయంత్రం బిర్లాతో సమావేశం అవుతారని స్పీకర్ కార్యాలయం తెలిపింది. దీంతో వీరు ముగ్గురు కూడా పార్టీ మారతారన్న ప్రచారం జోరందుకుంది. అయితే నూతన స్పీకర్ గా ప్రమాణస్వీకారం చేసిన బిర్లాను అభినందించేందుకే వీరు స్పీకర్ తో భేటీ కానున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి.

Andhra Pradesh
loksabha
BJP
Telugudesam
3 loksabha mps
speaker
birla
  • Loading...

More Telugu News