Andhra Pradesh: బూరలు, పిన్నులు అమ్ముకుంటున్న పిల్లలకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సాయం!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-85512a40a19398bc4d6f775a5aa23e3ce382bc43.jpg)
- పెదకొండూరులో ఇద్దరు అమ్మాయిలు
- పేదరికం కారణంగా బూరలు, పిన్నుల అమ్మకం
- ట్విట్టర్ లో స్పందించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి
గుంటూరు జిల్లాలోని పెదకొండూరులో తాను ఓ వివాహ కార్యక్రమానికి వెళుతుంటే, ఇద్దరు పిల్లలు బూరలు, పిన్నులు అమ్ముకుంటూ కనిపించారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తెలిపారు. వీరిది తుళ్లూరు మండలంలోని పెదపరిమి గ్రామమని చెప్పారు. పేదరికం, ఇంట్లో అధిక సంతానం కారణంగా ఈ పిల్లలు ఇలా అమ్ముకుంటూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. వీరికి బట్టలు, చెప్పులు కొనుక్కోవడానికి కొంత ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజన్న బడిబాట, అమ్మఒడి పథకాల గురించి ఇద్దరికీ వివరించాననీ, చదువుకుంటే ప్రభుత్వం నగదు ఇస్తుందని చెప్పానని ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-302dd9f9fa25189fcaec04ede5dcb435904621fb.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-f187ad7e272f829c4fe7270a1624e9382457b5b1.jpg)