Sunaina Roshan: ఓ ముస్లింను ఇష్టపడ్డానని... ఇంట్లో నరకం చూపుతున్నారంటున్న హృతిక్ రోషన్ సోదరి సునైనా రోషన్!

  • గత సంవత్సరం పరిచయమైన ఢిల్లీ వ్యక్తి
  • అతన్ని కలిసేందుకు ఇంట్లో ఒప్పుకోవడం లేదు
  • మీడియా ముందు వాపోయిన సునైనా రోషన్

ఓ ముస్లిం యువకుడిని ప్రేమించిన కారణంగా తనకు ఇంట్లో నరకం చూపిస్తున్నారని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ సోదరి సునైనా రోషన్‌ సంచలన ఆరోపణలు చేశారు. గత సంవత్సరం న్యూఢిల్లీలో తనకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడని, అతన్ని తాను ఇష్టపడగా, వివాహానికి ఇంట్లో ఒప్పుకోవడం లేదని ఆమె మీడియాకు తెలిపారు. అతన్ని కలిసేందుకు ఇంట్లో ఎవరూ అంగీకరించడం లేదని, పెళ్లి గురించి తానేమీ తొందరపడటం లేదని, కానీ ప్రేమించిన వ్యక్తితోనే కలిసుండాలని ఉందని, ముస్లిం అయినందునే ఇంట్లో వారు ఒప్పుకోవడం లేదని ఆమె వాపోయారు.

కాగా, ఈ విషయాన్ని తొలుత ప్రపంచం దృష్టికి తీసుకొచ్చింది మాత్రం కంగనా రనౌత్ సోదరి రంగోలీ కావడం గమనార్హం. హృతిక్ సోదరి తన ఇంట తీవ్రమైన హింసను అనుభవిస్తోందని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టడంతో అది సంచలనమైంది. దీనిపై వివరణ ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చిన సునైనా రోషన్, అది నిజమేనని చెప్పడంతో బాలీవుడ్ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి.

 ఇక, కంగనా సోదరి ద్వారా ఈ విషయాలను బయటపెట్టాల్సిన అవసరం ఏంటన్న మీడియా ప్రశ్నకు సునైనా స్పందిస్తూ, కంగన మహిళా సాధికారతకు నిదర్శనమని, ఆపదలో ఉన్న మహిళలను ఆమె ఆదుకునే ప్రయత్నం చేస్తుందని అన్నారు. తన సోదరుడు, కంగనల మధ్య ఏం జరిగిందో తనకు తెలీదని వ్యాఖ్యానించారు. తానున్న పరిస్థితుల్లో ఆమె తప్ప ఎవరూ సాయం చేయలేరనే సంప్రదించానని వివరణ ఇచ్చారు.

కాగా, ఈ మొత్తం వ్యవహారంపై అటు రాకేశ్ రోషన్ గానీ, ఇటు హృతిక్ రోషన్ గానీ స్పందించలేదు. హృతిక్ మాజీ భార్య సుసానే మాత్రం తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెడుతూ, సునైనా చాలా మంచిదని, ప్రస్తుతం బాధాకర పరిస్థితిలో ఉందని అన్నారు. రాకేశ్‌ రోషన్‌ క్యాన్సర్‌ తో బాధపడుతున్నారని గుర్తు చేసింది.

Sunaina Roshan
Hruthik Roshan
Muslim
Harrasment
  • Loading...

More Telugu News