vijay devarakonda: 'డియర్ కామ్రేడ్' నుంచి మనసును దోచే పాట

  • మరోసారి విజయ్ దేవరకొండ జోడీగా రష్మిక
  • సంగీత దర్శకుడిగా జస్టిన్ ప్రభాకరన్
  • వచ్చేనెల 26వ తేదీన విడుదల  

విజయ్ దేవరకొండ అభిమానులంతా ఇప్పుడు 'డియర్ కామ్రేడ్' సినిమా కోసమే వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన నటించింది. ఆల్రెడీ 'గీత గోవిందం'తో భలే జోడీ అనిపించుకున్న జంట కావడంతో, ఈ సినిమాపై సహజంగానే అంచనాలు పెరిగాయి.

తాజాగా ఈ సినిమా నుంచి మూడో లిరికల్ వీడియో సాంగును విడుదల చేశారు. "గిర గిర గిర తిరగలిలాగా .. తిరిగి అరిగిపోయినా దినుసే నలగాలేదుగా .., అలుపెరుగక తన వెనకాలే అలసి సొలసి పోయినా మనసే కరుగ లేదులే" అంటూ ఈ పాట సాగుతోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం .. రెహ్మాన్ సాహిత్యం ..  గౌతమ్ భరద్వాజ్ - యామినీ ఘంటసాల ఆలాపన మనసుకు పట్టేలా వున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మెలోడియస్ సాంగ్స్ లో ఇదొకటని చెప్పొచ్చు. వచ్చేనెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News