Andhra Pradesh: జూలై 10 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు!

  • 25 రోజుల పాటు సాగనున్న ఏపీ అసెంబ్లీ
  • జూలై 12న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
  • పలు అంశాలపై సాగనున్న వాడీవేడీ చర్చ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. వచ్చే నెల 10 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.ఈ సమావేశాలు 25 రోజుల పాటు కొనసాగుతాయని చెప్పారు. వచ్చే నెల 12న అసెంబ్లీలో 2019-20 బడ్జెట్ ను ప్రవేశపెడతారని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా నూతన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఏపీ అభివృద్ధి, కేంద్రం నుంచి అందాల్సిన నిధులు, పలు కీలక ప్రాజెక్టుల్లో పురోగతి సహా పలు అంశాలపై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ సాగనుంది.

Andhra Pradesh
assembly
budget sessions
july10
  • Loading...

More Telugu News