Garlic: వెల్లుల్లి పొట్టు తీయడం ఇంత ఈజీయా... ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియో!

  • వెల్లుల్లిని ఒలిచేందుకు సులువైన పద్ధతి
  • నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
  • 2 కోట్లకు పైగా వ్యూస్

వంటకాల్లో అల్లం, వెల్లుల్లికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఇక వెల్లుల్లిని ఒలవడం ఎంత కష్టమో అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ముఖ్యంగా పచ్చళ్లు పెట్టే సమయంలో ప్రతి ఆడపడుచూ వెల్లుల్లిని వలుస్తూ ఇబ్బందులు పడటాన్ని ప్రతి ఒక్కరూ చూసేవుంటారు. అయితే, వెల్లుల్లిని ఎలా సులువుగా రెబ్బలుగా చేయవచ్చో చూపుతున్న ఓ వీడియో, సోషల్‌ మీడియా పుణ్యమాని బయటకు వచ్చి, వైరల్ అయింది. వెల్లుల్లిని ఒలిచేందుకు ఇదే అత్యుత్తమమైన పద్ధతంటూ ఓ వీడియో రాగా, దీన్ని ఇప్పటికే 2 కోట్ల మందికిపైగా చూడటం గమనార్హం. గోరుకి ఎంతమాత్రం నొప్పి లేకుండా, అత్యంత సునాయాసంగా వెల్లుల్లిని ఓ యువతి వలుస్తుంటే, అమేజింగ్‌ టెక్నిక్‌, మైండ్‌ బ్లోయింగ్‌ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వాలెంతినా లార్డ్‌  చెఫ్ ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఇదే పద్ధతిని మీరూ ప్రయత్నించి చూడండి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News