Andhra Pradesh: 'అమ్మఒడి' పథకంపై జగన్ సర్కారు క్లారిటీ.. లబ్ధిదారులు ఎవరంటే..!
- ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే
- తల్లులకు ఏడాదికి రూ.15 వేలు
- వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు
అమ్మఒడి పథకం ఎవరికి వర్తిస్తుందన్న విషయంలో ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని, అందులో చదివే పిల్లల తల్లులు మాత్రమే ఈ పథకానికి అర్హులు అవుతారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలకు పంపించే తల్లులకు ‘అమ్మ ఒడి’ కింద ఏడాదికి రూ.15 వేలు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. అమ్మ ఒడి పథకం ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తిస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇచ్చింది. కాగా, వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి జగన్ ఇది వరకే పేర్కొన్నారు.