Kethan Sharma: అందర్నీ కంటతడి పెట్టిస్తున్న వీర జవాన్ చివరి ఫొటో!

  • జాయింట్ ఆపరేషన్ చేపట్టిన భారత సైన్యం
  • ఎదురు కాల్పుల్లో అమరుడైన మేజర్ కేతన్
  • కేతన్‌కు భార్య, నాలుగేళ్ల పాప

ఓ జవాను సోమవారం ఉదయం 7 గంటలకు తన ఇంటికి ఒక వాట్సాప్ పోస్ట్ పంపించారు. అది చూసిన వారికెవరికైనా హృదయం ద్రవించక మానదు. ఆ పోస్ట్ పెట్టిన తెల్లవారే ఉగ్రవాదులను మట్టు బెట్టేందుకు భారత సైన్యం అనంతనాగ్‌లో నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో ఆయన అమరుడవడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. భారత సైన్యం నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో అమరుడైన మేజర్ కేతన్ శర్మ సోమవారం ఉదయం ఒక సెల్ఫీ తీసుకుని, అదే తన చివరి ఫొటో అంటూ తన కుటుంబానికి వాట్సాప్ చేశారు.

ఆ మరునాడే ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో కేతన్ అమరుడయ్యారు. కేతన్‌కు భార్య, నాలుగేళ్ల పాప ఉన్నారు. ఇక ఆయన తల్లి ఉషను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. తన కొడుకు బుల్లెట్లకు భయపడే రకంకాదని, ఎక్కడికి వెళ్లినా తిరిగి తీసుకురావాలంటూ ఆమె విలపించడం అక్కడున్న వారందరికీ కన్నీళ్లు తెప్పించాయి.

Kethan Sharma
Usha
Indian Army
Joint Operation
Selfie
  • Loading...

More Telugu News