TTD: టీటీడీ చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా

  • టీటీడీలో ఆసక్తికర పరిణామం
  • రాజీనామా లేఖను ఈవోకు పంపిన పుట్టా సుధాకర్
  • కొత్త చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేయనున్న వైవీ సుబ్బారెడ్డి


ఏపీలో గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిని ఆర్డినెన్స్ ద్వారా తొలగిస్తామని కొత్త ప్రభుత్వం ఈరోజు ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెలువడి ఇరవైనాలుగు గంటలు కూడా కాకముందే టీటీడీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు పంపారు. ఇదిలా ఉండగా, టీటీడీ కొత్త చైర్మన్ గా వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం.

TTD
chairman
putta sudhakar yadav
EO
  • Loading...

More Telugu News