team india: టీమిండియాకు ఎదురుదెబ్బ... ప్రపంచకప్ మొత్తానికి దూరమైన శిఖర్ ధావన్

  • ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డ ధావన్
  • గాయం నుంచి కోలుకోని డ్యాషింగ్ బ్యాట్స్ మెన్
  • ధావన్ స్థానంలో రిషభ్ పంత్

ప్రపంచకప్ లో మెరుపులు మెరిపిస్తున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. డ్యాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచ కప్ మొత్తానికి దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా ధావన్ ఎడమచేతి బొటనవేలుకు గాయమైన సంగతి తెలిసిందే. దీంతో, మూడు మ్యాచ్ లకు విశ్రాంతి కల్పించారు. అయితే గాయం నుంచి ధావన్ కోలుకోలేకపోయాడు. ఇతర మ్యాచ్ లకు కూడా ధావన్ ఆడే పరిస్థితి లేకపోవడంతో... ప్రపంచకప్ కు పూర్తిగా దూరమయ్యాడు. ధావన్ స్థానంలో వికెట్ కీపర్-బ్యాట్స్ మెన్ రిషభ్ పంత్ జట్టులోకి వచ్చాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో దూకుడుగా ఆడిన ధావన్ 109 బంతుల్లో 117 పరుగులు చేశాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ నుంచి వెలువడిన రైజింగ్ డెలివరీకి ధావన్ గాయపడ్డాడు. ఆ తర్వాత ఫీల్డింగ్ కు కూడా ధావన్ రాలేదు.

team india
sikhar dhawan
injury
world cup
  • Loading...

More Telugu News