team india: లండన్‌లో టీమిండియా జట్టు సభ్యుల ఆట విడుపు.. ఓల్డ్‌బాండ్‌ స్ట్రీట్‌లో కొహ్లీ, అనుష్క సందడి

  • శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ భార్యా పిల్లలతో చక్కర్లు
  • పాకిస్థాన్‌పై గెలుపు అనంతరం జట్టు సభ్యుల్లో కొత్త ఉత్సాహం
  • శనివారం ఆప్ఘనిస్థాన్‌తో తలపడనున్న భారత్‌

చిరకాల ప్రత్యర్థి, దాయాది పాకిస్థాన్‌పై ఘన విజయం అనంతరం టీమిండియా సభ్యులు లండన్‌ వీధుల్లో సందడి చేస్తున్నారు. పదిహేను రోజులపాటు భార్యా పిల్లలతో గడిపేందుకు బీసీసీఐ అనుమతించడంతో కెప్టెన్‌ కొహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తదితరులు తమ భార్యా, పిల్లల్ని వెంటేసుకుని సరదాగా గడుపుతున్నారు.

పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అనంతరం భారత్‌ శనివారం ఆప్ఘనిస్థాన్‌తో తలపడనుంది. ఈ మధ్యలో ఐదు రోజులపాటు విరామం ఉండడంతో సభ్యులకు కలిసి వచ్చింది.  రెండు రోజుల పాటు ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను కూడా రద్దుచేసి విరామం ఇచ్చారు. లండన్‌లోని ఓల్డ్‌బాండ్‌ స్ట్రీట్‌లో కొహ్లీ, అనుష్క జంట కనిపించడంతో అభిమానులు తమ కెమెరాలకు పనిచెప్పారు. రోహిత్‌, ధావన్‌లు కుటుంబాలతో గడుపుతున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

team india
london
Virat Kohli
anuska
Rohit Sharma
sikhardhavan
  • Loading...

More Telugu News