Andhra Pradesh: కేవలం పబ్లిసిటీ కోసమే చంద్రబాబు ‘సోమవారం పోలవరం’ చేపట్టారు!: పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

  • రేపు జగన్ పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తారు
  • ఆయనకు టీడీపీ నేతల దోపిడీని వివరిస్తా
  • మీడియాతో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని పోలవరం ఎమ్మెల్యే, వైసీపీ నేత తెల్లం బాలరాజు తెలిపారు. పోలవరం నియోజకవర్గం పరిధిలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో టీడీపీ నేతలు భారీ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళతామని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో తెల్లం బాలరాజు మాట్లాడారు.

పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం విషయంలో న్యాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరుతామని బాలరాజు పేర్కొన్నారు. టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కేవలం పబ్లిసిటీ కోసమే ‘సోమవారం పోలవరం’ కార్యక్రమాన్ని చేపట్టారని దుయ్యబట్టారు. కమీషన్ల కోసం పట్టిసీమను కట్టి పోలవరాన్ని నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Andhra Pradesh
polavaram
YSRCP
Jagan
balaraju
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News