Andhra Pradesh: గుంటూరులో వైసీపీ నేతల మధ్య ఘర్షణ.. ఒకరికి తీవ్రగాయాలు!

  • మీ సేవా కేంద్రం నిర్వహణ విషయంలో గొడవ
  • రెండు గ్రూపులుగా విడిపోయిన వైసీపీ నేతలు
  • ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య ఈరోజు ఘర్షణ చోటుచేసుకుంది జిల్లాలోని నాదెండ్ల మండలం సాతులూరులో ‘మీ సేవా’ కేంద్రం ఏర్పాటు అయింది. అయితే దీన్ని మేం నిర్వహిస్తాం.. అంటే మేం నిర్వహిస్తాం అని వైసీపీ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి వాదులాడుకున్నారు.

ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం కాస్తా హద్దుదాటడంతో రెండు గ్రూపులు కర్రలు, రాళ్లతో దాడిచేసుకున్నాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా, బాధితుడిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

Andhra Pradesh
Guntur District
YSRCP
fight
mee seva
  • Loading...

More Telugu News