Andhra Pradesh: గోపాలకృష్ణ ద్వివేదీకి కీలక పోస్టింగ్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం!

  • రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా పనిచేసిన ద్వివేది 
  • పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శిగా నియామకం
  • ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా గోపాలకృష్ణ ద్వివేది పనిచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు ఏపీ ప్రభుత్వం కీలక పదవిని అప్పగించింది. గోపాలకృష్ణ ద్వివేదిని ‘పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి’ మంత్రిత్వశాఖ ముఖ్యకార్యదర్శిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు.

ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన ద్వివేది ఎన్నికల ముందు వరకూ కేంద్ర ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేశారు. ఏపీ పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల అనంతరం ద్వివేదిని బదిలీ చేసిన ఎన్నికల సంఘం ఆయన స్థానంలో కె. విజయానంద్ ను నియమించింది. అయితే ద్వివేదికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. తాజాగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

Andhra Pradesh
gopala krishna dwewedi
cs
lv subramanyam
panchyatraj and villege development cs
  • Loading...

More Telugu News