cm: సీఎం జగన్ సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి నియామకం

  • ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
  • సజ్జలకు కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ ఆదేశాలు
  • ప్రస్తుతం వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల

ఏపీ సీఎం ప్రజా వ్యవహారాల సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించారు. ఈ మేరకు ఏడీ (పొలిటికల్) ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. సజ్జలకు కేబినెట్ మంత్రి హోదా కల్పించారు. సజ్జల నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని, ఈ నియామకానికి సంబంధించి నియమ నిబంధనలను విడిగా విడుదల చేయనున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ కు రాజకీయ సలహాదారుగా గతంలో సజ్జల వ్యవహరించారు. ప్రస్తుతం వైసీపీ ప్రధాన కార్యదర్శిగా సజ్జల కొనసాగుతున్నారు. కాగా, సుదీర్ఘకాలంగా జర్నలిస్ట్ గా ఆయన పని చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో మీడియా వ్యవహారాల బాధ్యతలను సజ్జల నిర్వహించారు. 

cm
jagan
public relation
advisor
sajjala
  • Loading...

More Telugu News