Ajay kallam: వివిధ రంగాల వారికి రుణ ప్రణాళికల విషయమై బ్యాంకర్లతో చర్చించిన జగన్

  • సచివాలయంలో బ్యాంకర్లతో సమావేశం
  • రుణ ప్రణాళికను ఆవిష్కరించిన జగన్
  • హాజరైన సీఎస్, అజయ్ కల్లం తదితరులు

2019 - 20కి గాను రాష్ట్ర రుణ ప్రణాళికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. నేడు రాష్ట్ర సచివాలయంలో రుణ ప్రణాళికకు సంబంధించి బ్యాంకర్లతో జగన్ నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లంతో పాటు రాష్ట్ర బ్యాంకర్ల సంఘం అధ్యక్షుడు ఎస్.దాస్ తదితరులు హాజరయ్యారు. రైతులతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే ఔత్సాహికులకు, డ్వాక్రా మహిళలు, వివిధ రంగాల వారికి సంబంధించిన రుణ ప్రణాళికల విషయమై ఈ సమావేశంలో జగన్ ముఖ్యంగా చర్చించారు.

Ajay kallam
LV Subrahmanyam
Jagan
Kanna Babu
Peddireddy Ramachandra Reddy
Dwakra Women
  • Loading...

More Telugu News