Chandrasekhar: అమెరికాలో తెలుగు కుటుంబం మృతిపై వివరాలు వెల్లడించిన పోలీసులు

  • అమెరికాలో స్థిరపడిన చంద్రశేఖర్ దంపతులు
  • టెక్నాలజీ సర్వీస్‌ బ్యూరోలో ఉద్యోగం
  • ఇటీవలే ఆయుధం కొన్నట్టు దర్యాప్తులో వెల్లడి
  • ఘటనకు దారి తీసిన పరిస్థితులపై ఆరా

ఇటీవల అమెరికాలోని అయోవా రాష్ట్రంలోని వెస్ట్‌ డి మాయిస్‌ నగరంలో ఓ తెలుగు కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వీరికి సంబంధించిన వివరాలను అక్కడి పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లాకు చెందిన చంద్రశేఖర్, లావణ్య దంపతులు 11 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అప్పటి నుంచి చంద్రశేఖర్ అక్కడి టెక్నాలజీ సర్వీస్‌ బ్యూరోలో పనిచేస్తున్నారు.

ఇటీవలే ఆయన ఆయుధం కలిగి ఉండేందుకు అనుమతి పొంది, ఆ తరువాత ఒక ఆయుధం కూడా కొన్నట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. అనంతరం తన భార్య లావణ్య, ఇద్దరు పిల్లల్ని కాల్చి చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. చంద్రశేఖర్ బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. దీంతో ఆయుధాన్ని ఆయన ఎక్కడ కొనుగోలు చేశారో కూడా తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News