Eoin Morgan: ఒక్కడే 17 సిక్సర్లు బాదాడు... ఇంగ్లాండ్, ఆప్ఘనిస్తాన్ మ్యాచ్ లో వరల్డ్ రికార్డు

  • ఆఫ్ఘన్ బౌలర్లపై శివాలెత్తిన ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్
  • 71 బంతుల్లో 148 పరుగులు సాధించిన వైనం
  • మోర్గాన్ ధాటికి బెంబేలెత్తిన ఆఫ్ఘన్ కూనలు

ప్రపంచకప్ లో సిసలైన బ్యాటింగ్ ప్రదర్శన అంటే ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయార్ మోర్గాన్ దేనని చెప్పాలి. ఇవాళ మాంచెస్టర్ లో ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ లో మోర్గాన్ అత్యధిక సిక్సర్ల ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు. సెకండ్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన మోర్గాన్ ఆఫ్ఘన్ బౌలర్లను నిజంగానే పసికూనల్లా మార్చేస్తూ 17 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. గతంలో ఈ రికార్డు క్రిస్ గేల్, ఏబీ డివిల్లీర్స్, రోహిత్ శర్మల పేరిట ఉంది. 16 సిక్సర్ల గత రికార్డును మోర్గాన్ ఘనంగా తిరగరాశాడు. రషీద్ ఖాన్ లాంటి మిస్టరీ బౌలర్ సైతం మోర్గాన్ దూకుడు ముందు విలవిల్లాడిపోయాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మోర్గాన్ అవుటయ్యే సమయానికి రషీద్ ఖాన్ 8 ఓవర్లలో 96 పరుగులు సమర్పించుకున్నాడు.

Eoin Morgan
England
Afghanistan
World Record
Sixers
ODI
World Cup
  • Error fetching data: Network response was not ok

More Telugu News