Amith Shah: అవి రెండు వేర్వేరు అంశాలు.. ఒకదానితో మరొకటి ముడి పెట్టకండి: అమిత్‌షా వ్యాఖ్యలపై పాక్ ఆర్మీ అధికారి ట్వీట్

  • భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఘోర పరాజయం
  • దేశ వ్యాప్తంగా పాక్ ఆటగాళ్లపై నిరసనలు
  • మరో సర్జికల్ స్ట్రయిక్‌గా అభివర్ణించిన అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై పాక్ ఆర్మీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో భాగంగా ఇంగ్లాండ్ వేదికగా ఆదివారం జరిగిన భారత్ - పాక్ మ్యాచ్‌లో పాక్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో భారత్‌లో సంబరాలు అంబరాన్నంటుతుంటే, పాక్ మాత్రం దీనిని జీర్ణించుకోలేక పోతోంది. తమ దేశపు ఆటగాళ్లపై పాక్ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

పాక్‌పై భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసిన సందర్భంగా దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా స్పందించారు. పాక్‌పై భారత్ విజయాన్ని ఆయన మరో సర్జికల్ స్ట్రయిక్‌గా అభివర్ణించారు. దీనిపై పాక్ ఆర్మీ అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. మ్యాచ్, సర్జికల్ స్ట్రయిక్‌లు అనేవి వేర్వేరు అంశాలని, ఒకదానిని మరొక దానితో ముడి పెట్టవద్దని పేర్కొంటూ ట్వీట్ చేశారు.

Amith Shah
Pakistan
India
World Cup
England
Surgical Strike
  • Loading...

More Telugu News