Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణస్వీకారం సమయంలో.. 'జై శ్రీరాం, భారత్ మాతాకీ జై' నినాదాలతో మారుమోగిన సభ.. వీడియో

  • ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేందుకు లేచిన ఒవైసీ
  • భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేసిన బీజేపీ సభ్యులు
  • అల్లాహు అక్బర్, జైహింద్ అంటూ ముగించిన ఒవైసీ

లోక్ సభలో ఎంపీల ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వంతు వచ్చింది. ప్రమాణస్వీకారం చేసేందుకు ఆయన తన స్థానం నుంచి లేవగానే... 'జై శ్రీరాం, భారత్ మాతాకీ జై' అంటూ బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. అయితే, మీ ఇష్టం వచ్చినట్టు అరుచుకోండి అన్నట్టుగా గాల్లో చేతులు ఊపుతూ పోడియంలోకి వచ్చిన ఒవైసీ... ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ముగించారు. తన ప్రమాణాన్ని 'జై భీమ్.. జై భీమ్.. తక్బీర్.. అల్లాహు అక్బర్.. జై హింద్' అంటూ ముగించారు.

అనంతరం పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ... తనను చూడగానే బీజేపీ నేతలకు అవన్నీ గుర్తుకొస్తాయని అన్నారు. వీటితో పాటు రాజ్యాంగాన్ని, ముజఫర్ పూర్ లో చిన్నారుల మరణాలను కూడా వారు గుర్తుంచుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

Asaduddin Owaisi
oath
bharath matha
aimim
  • Loading...

More Telugu News