kothapalli geetha: అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత

  • జనజాగృతి పార్టీని బీజేపీలో విలీనం చేసిన గీత
  • పార్టీలోకి ఆహ్వానించిన రామ్ మాధవ్
  • 2014లో వైసీపీ తరపున గెలిచిన గీత

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. తాను స్థాపించిన జనజాగృతి పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఈ సందర్భంగా గీతను పార్టీలోకి అమిత్ షా సాదరంగా ఆహ్వానించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఆహ్వానం మేరకు ఆమె బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.  2014లో వైసీపీ తరపున పోటీ చేసిన గీత ఎంపీగా గెలుపొందారు. అనంతరం ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన ఆమె... సొంతంగా జనజాగృతి అనే పార్టీని గత ఏడాది స్థాపించారు.

ఈ సందర్భంగా అమిత్ షా, రామ్ మాధవ్ లకు ట్విట్టర్ ద్వారా గీత ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ వేదికగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. అమిత్ షా నాయకత్వంలో పార్టీ ఉన్నతి కోసం చిత్తశుద్ధితో పని చేస్తానని అన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News