speacial status: ఎక్కువ ఎంపీలు ఉన్నారు కదా.. మీరు సాధించి చూపించండి: గోరంట్ల బుచ్చయ్య చౌదరి సవాల్

  • ఎక్కువ మంది ఎంపీలను ఇస్తే హోదా సాధిస్తామని వైసీపీ చెప్పింది
  • చేతనైతే సాధించండి
  • మేము కూడా సహకరిస్తాం

ప్రత్యేక హోదాపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా సభలో వాడివేడి చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, ఎక్కువ మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల సమయంలో వైసీపీ చెప్పుకుందని... ఇప్పుడు ఎక్కువ మంది ఎంపీలు వైసీపీకి ఉన్నారని... ప్రత్యేక హోదాను సాధించమనండని చెప్పారు. హోదాను సాధించేందుకు తాము కూడా పూర్తిగా సహకరిస్తామని అన్నారు. వైసీపీ హోదా సాధిస్తే మంచిదేనని... రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ చేసిందేమీ లేదని వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. 'మేము సాధించలేక పోయాం... మీరు సాధించండి' అంటూ సవాల్ విసిరారు.

speacial status
Gorantla Butchaiah Chowdary
Telugudesam
ysrcp
  • Loading...

More Telugu News