Andhra Pradesh: ప్రత్యేక హోదాను వదిలిపెట్టి ప్యాకేజ్ కావాలన్నారు: టీడీపీపై బుగ్గన విమర్శలు

  • ‘హోదా’ అని ఎందుకు తీర్మానం చేశారు?
  • ‘హోదా’ కోసం పోరాడితే కలిసొస్తామన్నా పట్టించుకోలేదు
  • ప్రత్యేక హోదాపై మా ప్రభుత్వం  కచ్చితంగా ముందుకెళ్తుంది

ఏపీకి ప్రత్యేక హోదాను వదిలిపెట్టి ప్యాకేజ్ కావాలని నాడు కోరింది టీడీపీ అధినేత చంద్రబాబునాయుడేనని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, ప్యాకేజ్ తీసుకునే వాళ్లు ‘హోదా’ అని ఎందుకు తీర్మానం చేశారని టీడీపీ నేతలను ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడితే కలిసొస్తామని నాడు తాము చెప్పినా అందుకు ఒప్పుకోలేదని ఎద్దేవా చేశారు. ఒకటిన్నర సంవత్సరం తర్వాత ‘హోదా’ పై గత ప్రభుత్వం తీర్మానం చేసిందని విమర్శించారు. ప్రత్యేక హోదాపై తమ ప్రభుత్వం కచ్చితంగా ముందుకెళ్తుందని స్పష్టం చేశారు.  

Andhra Pradesh
assembly
Telugudesam
Chandrababu
YSRCP
mla
buggana
rajendranath reddy
  • Loading...

More Telugu News