Om Birla: బీజేపీతో వైసీపీ చెలిమి... ఓమ్ బిర్లాను ప్రతిపాదించిన వారిలో ఎంపీ మిథున్ రెడ్డి!

  • బీజేపీతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని నిర్ణయం
  • సంతకం చేసిన మిథున్ రెడ్డి
  • పూర్తి మద్దతు తెలుపుతున్నట్టు వెల్లడి

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో స్నేహపూర్వకంగానే వ్యవహరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. లోక్ సభలో స్పీకర్ గా రాజస్థాన్ లోని కోట నియోజకవర్గ ఎంపీ ఓమ్ బిర్లాను ఎంపిక చేయగా, ఆయన్ను ప్రతిపాదిస్తూ వైసీపీ లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి సంతకం చేశారు. ఓమ్ బిర్లాకు తమ పార్టీ పూర్తి మద్దతును ప్రకటిస్తోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కాగా, పలు ఇతర పార్టీలు కూడా ఆయనకు మద్దతు పలికిన నేపథ్యంలో విపక్ష కాంగ్రెస్ ఎవరినీ పోటీకి దించేందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. ఓమ్ బిర్లా ఎన్నిక దాదాపు ఏకగ్రీవమైనట్టేనని పలువురు ఎంపీలు వ్యాఖ్యానించారు.

Om Birla
BJP
YSRCP
Midhun Reddy
Lok Sabha
Speaker
  • Loading...

More Telugu News