Andhra Pradesh: 'తెగులుదేశం' అవుతుందన్నదే నా భయం: కోలగట్ల వీరభద్రస్వామి

  • అవినీతితో ప్రజలకు దూరమైన టీడీపీ
  • హామీలు నెరవేర్చనందుకే వైసీపీకి పట్టం
  • అసెంబ్లీలో కోలగట్ల

తాము అధికారంలో ఉన్న వేళ జరిపిన అవినీతితో ప్రజలకు దూరమైన తెలుగుదేశం పార్టీ 'తెగులుదేశం' పార్టీగా మారుతుందన్న భయం తనలో ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైందని, అందువల్లే ప్రజలు తమకు అధికారాన్ని ఇచ్చారని అన్నారు.

తమ అధినేత ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలనూ నెరవేర్చేందుకు కట్టుబడివున్నారని, విపక్ష నేతలు నిర్మాణాత్మక సలహాలు ఇస్తే తీసుకుంటామే తప్ప, ప్రతి విషయంలోనూ విమర్శలు మాత్రమే చేస్తుంటే మాత్రం ఊరుకోబోమని అన్నారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకురానుండటం జగన్ తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయమని కోలగట్ల వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
Assembly
Kolagatla Veerabhadrawsymy
  • Loading...

More Telugu News