vijayasai reddy: పక్కపక్కనే కూర్చున్న విజయసాయిరెడ్డి, సీఎం రమేశ్.. సుదీర్ఘ చర్చలు!

  • లోక్ సభలో ఆసక్తికర సన్నివేశం
  • ఆప్యాయంగా మాట్లాడుతూ.. సుదీర్ఘంగా చర్చించిన నేతలు
  • అందరి దృష్టిని ఆకర్షించిన మంతనాలు

లోక్ సభలో ఎవరూ ఊహించని ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. లోక్ సభ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ లు పక్కపక్కనే కూర్చున్నారు. తొలుత వచ్చిన సీఎం రమేష్ గ్యాలరీ ముందు వరుసలో కూర్చున్నారు. ఆ తర్వాత వచ్చిన విజయసాయిరెడ్డి వెనుక వరుసలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కరచాలనం చేసుకున్నారు. కాసేపటి తర్వాత విజయసాయి వచ్చి సీఎం రమేష్ పక్కన ఆసీనులయ్యారు.

ఆ తర్వాత ఇద్దరూ కలసి దాదాపు గంటన్నరకు పైగా చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ, సుదీర్ఘంగా చర్చించారు. కాసేపటి తర్వాత అక్కడకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వచ్చి... వారిద్దరికీ కొంత దూరంలో కూర్చున్నారు. ఆ తర్వాత కూడా విజయసాయి, సీఎం రమేష్ లు చర్చల్లోనే మునిగిపోయారు. వీరి మంతనాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

సమావేశానంతం ఇదే విషయం గురించి విజయసాయిరెడ్డిని మీడియా ప్రతినిధులు ఆరా తీశారు. దీనికి సమాధానంగా... 'మీ హయాంలో ఏం మేం చేశారో?' చెప్పమని రమేష్ ను అడిగానని విజయసాయిరెడ్డి నవ్వుతూ బదులిచ్చారు.

vijayasai reddy
cm ramesh
Lok Sabha
discussion
  • Loading...

More Telugu News