avanthi srinivas: టీడీపీ ఓటమికి ఇదే కారణం: మంత్రి అవంతి శ్రీనివాస్

  • ఒంటెద్దు పోకడలే టీడీపీ ఓటమికి కారణం
  • హోదాపై చంద్రబాబు చాలా సార్లు యూటర్న్ తీసుకున్నారు
  • వ్యక్తిగత స్వార్థం కోసం నేను పని చేయలేదు

ఏపీ అసెంబ్లీలో మంత్రి అవంతి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒంటెద్దు పోకడలే టీడీపీ ఓటమికి ప్రధాన కారణమని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ నవరత్నాలను కూడా కాపీ కొట్టారని విమర్శించారు. ప్రత్యేక హోదాపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సార్లు యూటర్న్ తీసుకున్నారని చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్ మాత్రం నమ్మిన సిద్ధాంతాన్ని ఎన్నడూ వీడలేదని అన్నారు. అమరావతి గురించి చాలా గొప్పగా చెప్పుకున్న నేతలు... ఇప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పారు. వ్యక్తిగత స్వార్థం కోసం తాను ఎన్నడూ పని చేయలేదని తెలిపారు. పదవులకు రాజీనామా చేసిన తర్వాతే తాను పార్టీ మారానని చెప్పారు. వైసీపీ మేనిఫెస్టోలో ఉన్న అన్నింటినీ నెరవేర్చుతామని అన్నారు.

avanthi srinivas
chandrababu
jagan
Telugudesam
ysrcp
  • Loading...

More Telugu News