terrorists: అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

  • 24 గంటల్లోపే రెండో ఎన్‌కౌంటర్
  • అమరుడైన ఆర్మీ జవాను
  • ఉగ్రవాదులు జైషే మహ్మద్ సంస్థకు చెందిన వారిగా గుర్తింపు

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఈ ఉదయం  జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ ఆర్మీ జవాను అమరుడయ్యాడు. హతమైన ఇద్దరు ఉగ్రవాదులు జైషే మహ్మద్ సంస్థకు చెందిన వారుగా ఆర్మీ పేర్కొంది. జిల్లాలోని బిజ్‌బెహరాలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. భద్రతా సిబ్బందిని చూసిన ఉగ్రవాదులు గ్రనేడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ జవాను అమరుడయ్యాడు. ప్రతిగా భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా, 24 గంటల్లోపే ఈ ప్రాంతంలో జరిగిన రెండో ఎన్‌కౌంటర్ ఇది. అంతకుముందు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ మేజర్ అమరుడు కాగా, ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.

terrorists
Anantnag
encounter
Jammu And Kashmir
  • Loading...

More Telugu News