Kollywood: విశాల్ తెలుగోడు, కోలీవుడ్ లో కలుపుమొక్క: భారతీరాజా తీవ్ర విమర్శలు

  • పందికొక్కులా నిధులను మెక్కి తిన్నారు
  • తమిళేతరుల పెత్తనం పెరిగిపోయింది
  • కలకలం రేపుతున్న భారతీరాజా వ్యాఖ్యలు

తమిళ చలనచిత్ర పరిశ్రమలో నడిగర్ సంఘానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ, పోటీదారుల మధ్య ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరాయి. దర్శకుడు భారతీరాజా, నటుడు విశాల్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తమిళ నటుడు కాదని, తెలుగువాడని అన్నారు.

నిర్మాతల మండలిలో ఆయన ఓ కలుపు మొక్కలా తయారయ్యాడని, ఇటువంటి వారిని తరిమికొడితేనే పరిశ్రమ బాగుంటుందని అన్నారు. విశాల్ ఓ పందికొక్కులా సంఘం నిధులను మెక్కి తిన్నాడని నిప్పులు చెరిగిన భారతీరాజా, తమిళ చిత్ర పరిశ్రమలో తమిళేతరుల పెత్తనం పెరిగిపోయిందని అన్నారు. భారతీరాజా వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవడ్ లో కలకలం రేపుతున్నాయి.

Kollywood
Tamilnadu
Bharatiraja
Vishal
  • Loading...

More Telugu News