budda Venkanna: బుద్ధా వెంకన్నకు సెక్యూరిటీ తగ్గింపు... అసలు వద్దేవద్దన్న టీడీపీ నేత!

  • 2+2 నుంచి 1+1కు తగ్గింపు
  • నాకు ఆ ఇద్దరూ కూడా వద్దు
  • వెనక్కు పంపిన బుద్ధా వెంకన్న

తన సెక్యూరిటీని తగ్గించడంలో అలకబూనిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఉన్న భద్రతా సిబ్బందిని కూడా వెనక్కు పంపించారు. ఇప్పటికే పలువురు మాజీలకు భద్రతను తగ్గించిన జగన్ సర్కారు, ప్రజా ప్రతినిధుల విషయంలోనూ సమీక్షలు నిర్వహిస్తూ, పలువురి భద్రతను కుదిస్తోంది. ఈ క్రమంలో బుద్ధా వెంకన్నకు ఉన్న 2 ప్లస్ 2 భద్రతను 1 ప్లస్ 1కు కుదించింది. దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన వెంకన్న, ఆ ఇద్దరూ కూడా తనకు వద్దని వారిని వెళ్లిపోవాలని ఆదేశించారు.

వాస్తవానికి విజయవాడలో నివాసం ఉండే ప్రజా ప్రతినిధులు, మంత్రులకు సిటి సెక్యూరిటి వింగ్‌ నుంచి గన్‌ మెన్‌ లను కేటాయిస్తారు. జిల్లాలోని మిగతా ప్రజా ప్రతినిధులకు ఆర్మ్ డ్ రిజర్వ్‌ విభాగం నుంచి గన్‌ మెన్‌ లను పంపుతారు. కాగా, గన్‌ మెన్‌ ల ఉపసంహరణ తమ చేతుల్లో లేదని, స్థానిక పోలీసు అధికారులు అంటున్నారు. పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌ లో ఏర్పడిన కమిటీ సూచనల మేరకే భద్రత ఖరారవుతుందని చెబుతున్నారు.

budda Venkanna
Security
Telugudesam
  • Loading...

More Telugu News