BJP: జేపీ నడ్డా పార్టీలో కష్టపడి పని చేసే కార్యకర్త: ప్రధాని మోదీ

  • నడ్డాలో శ్రమించేతత్త్వం, ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్నాయి
  • అందువల్లే, ఆయన ఈ స్థాయికి ఎదిగారు
  • వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపికైన నడ్డాకు అభినందనలు

బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైన జేపీ నడ్డాకు ప్రధాని మోదీ తన అభినందనలు తెలిపారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. జేపీ నడ్డా పార్టీలో కష్టపడి పని చేసే కార్యకర్త అని ప్రశంసించారు. శ్రమించేతత్త్వం, ఆర్గనైజేషన్ స్కిల్స్ వల్లే నడ్డా ఈ స్థాయికి ఎదిగారని కొనియాడారు. వినయపూర్వకంగా, స్నేహ పూర్వకంగా ఉండే నడ్డాను బీజేపీ కుటుంబం ఎంతో గౌరవిస్తుందని, అన్నారు. అమిత్ షా, నడ్డాల నాయకత్వంలో, తమ కార్యకర్తల కృషితో ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడాన్ని బీజేపీ కొనసాగిస్తుందన్న విశ్వాసం తనకు ఉందని అన్నారు. సమగ్రమైన, దృఢమైన భారతదేశ నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామని మోదీ పేర్కొన్నారు. 

BJP
Jp Nadda
pm
Modi
  • Loading...

More Telugu News