Smruthi Irani: స్మృతి ప్రమాణ స్వీకారం.. బల్లలు చరుస్తూ అభినందించిన ప్రధాని సహా ఇతర సభ్యులు

  • అమేథీ నుంచి రాహుల్‌ గాంధీపై పోటీ
  • స్వల్ప మెజారిటీతో విజయం సాధించిన స్మృతి
  • సంజ్ఞల ద్వారా అభినందనలు తెలిపిన సోనియా

నేడు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్‌కు కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి.. అది కూడా ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై పోటీ చేసి స్మృతి విజయం సాధించారు.

ఆమె ప్రమాణ స్వీకారం చేస్తుండగా ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా బీజేపీ ఎంపీలంతా పెద్ద ఎత్తున చాలా సేపు బల్లలు చరుస్తూ ఆమెకు అభినందనలు తెలపడం విశేషం. రాహుల్ గాంధీపై సాధించిన విజయానికి మెచ్చుకోలుగా ఆమెకు బీజేపీ ఇలా అభినందనలు తెలిపింది. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా ఆమెకు సంజ్ఞల ద్వారా అభినందనలు తెలిపారు.

Smruthi Irani
Rahul Gandhi
Amethi
Sonia Gandhi
Amith Shah
Narendra Modi
  • Loading...

More Telugu News