Rahul Gandhi: ప్రమాణ స్వీకారం తర్వాత.. అసలు విషయాన్ని మరచిన రాహుల్

  • వయనాడ్ నుంచి విజయం సాధించిన రాహుల్
  • అమేథీలో పరాజయమే మిగిలింది
  • ప్రమాణ స్వీకారానంతరం సంతకం మరచిన రాహుల్

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు 17వ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అసలు విషయాన్ని మాత్రం మరువడంతో అక్కడి అధికారులు, కేంద్ర మంత్రులు జోక్యం చేసుకుని ఆయనకు గుర్తు చేయాల్సి వచ్చింది. నేడు లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాహుల్ సంతకం చేయడం మరిచి తన స్థానం వద్దకు వెళ్లబోగా అక్కడే ఉన్న అధికారులు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఆయనకు ఈ విషయాన్ని గుర్తు చేశారు. దీంతో మళ్లీ వెళ్లి రాహుల్ సంతకం చేశారు. అనంతరం తల్లి సోనియా గాంధీ, సొంత పార్టీ సభ్యుల అభినందనల నడుమ రాహుల్ తన స్థానానికి వెళ్లారు.

Rahul Gandhi
Sonia Gandhi
Rajnath Singh
Amethi
Kerala
Vayonad
  • Loading...

More Telugu News