Jammu And Kashmir: సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆర్మీ మేజర్ మృతి

  • కాల్పులు జరిపిన ఉగ్రవాదులు
  • గాయపడిన ముగ్గురు జవాన్లు
  • 92 బేస్ ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు

జమ్మూకశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లా అచ్‌బల్ ప్రాంతంలో నేటి ఉదయం భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగడబడ్డారు. ఈ సందర్భంగా సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆర్మీ మేజర్ అమరుడవగా, మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. క్షతగాత్రులను శ్రీనగర్‌లోని ఆర్మీకి చెందిన 92 బేస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

Jammu And Kashmir
Achbal
Soldiers
Srinagar
Army Major
92 Base Hospital
  • Loading...

More Telugu News