Chaina: బాధ్యత గుర్తెరిగిన హాంకాంగ్‌ ప్రజలు.. అంబులెన్సు కోసం పక్కకు తప్పుకున్న నిరసనకారులు!

  • ఓ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన ప్రజలు
  • సడెన్‌గా అస్వస్థతకు గురైన నిరసనకారుడు
  • ఆసుపత్రికి తరలించేందుకు అటుగా వచ్చిన అంబులెన్స్

హాంకాంగ్‌కి సంబంధించిన ఓ వీడియో ప్రపంచాన్ని కదిలించింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆ వీడియోకి జనం నీరాజనం పలుకుతున్నారు. లక్షలాది మంది ప్రజలు ఎండ మండతున్నా లెక్క చేయక వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తుంటే, అటుగా వచ్చిన ఓ అంబులెన్స్‌కి ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ దారిచ్చి, అది వెళ్లి పోయే వరకూ మౌనం వహించారు. అనంతరం ఆందోళన కొనసాగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చైనాకు నేరస్థులను అప్పగించే బిల్లును నిరసిస్తూ ఆదివారం హాంకాంగ్‌లో ప్రజలు లక్షలాదిగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఒక నిరసనకారుడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. సృహతప్పి పడిపోయాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు ఒక అంబులెన్స్ అక్కడికి వచ్చింది. అంబులెన్స్ రాగానే అక్కడ ఉన్న ప్రజానీకమంతా మౌనంగా దారిచ్చింది. వాహనం వెళ్లిపోయిన అనంతరం యథావిధిగా తమ ఆందోళనను కొనసాగించింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు హాంకాంగ్ ప్రజల క్రమశిక్షణపైన ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.                  

  • Loading...

More Telugu News