rss: బెంగాల్ లో హింసకు కారణం ఇదే: మమతా బెనర్జీపై ఆరెస్సెస్ చీఫ్ ఫైర్

  • అధికార కాంక్షతో హింసను మమత ప్రోత్సహిస్తున్నారు
  • గతంలో ఎన్నడూ ఇలాంటి హింస చోటుచేసుకోలేదు
  • ప్రాణాలు కోల్పోయినవారంతా ఒకే పార్టీకి చెందినవారు

పశ్చిమబెంగాల్ లో చోటు చేసుకుంటున్న హింసకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఉన్న అధికార కాంక్షే కారణమని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ విమర్శించారు. మరోసారి అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో హింసను మమత ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

 ప్రజలను రక్షించడం కోసం, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం కోసం మమత గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెంగాల్ లో గతంలో ఎన్నడూ ఇలాంటి హింస చోటుచేసుకోలేదని అన్నారు. హింసలో ప్రాణాలు కోల్పోయినవారంతా ఒకే పార్టీకి చెందినవారని చెప్పారు. నిరసనకు దిగేవారిని ఇతర ప్రాంతాలకు చెందినవారని చెప్పడం సరికాదని అన్నారు. బెంగాల్ లో ఇకపై హింసాత్మక ఘటనలు చోటు చేసుకోరాదని ఆయన ఆకాంక్షించారు.

rss
mohan bhagawat
mamata banerjee
tmc
  • Loading...

More Telugu News