Andhra Pradesh: మరో ముప్పై ఏళ్లు ఈ రాష్ట్రాన్ని నవశకం వైపు నడిపే నాయకుడు జగనే: ఎమ్మెల్యే రోజా

  • ఈ రాష్ట్రానికి మంచి నాయకుడు దొరికాడు
  • ‘అమ్మఒడి’ దేశంలోనే ఆదర్శంగా నిలబడుతుంది
  • చంద్రబాబు తన హామీలను నిలబెట్టుకోలేదు

కారు షెడ్ లో ఉండాలి, ఆడది ఇంట్లో ఉండాలంటూ ఏపీ ఎన్నికల ప్రచార సమయంలో మాట్లాడిన వారిని ప్రజలు ఓడించి పంపించారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని ప్రజలు ఓడించి షెడ్ లో కూర్చోబెట్టారని సెటైర్లు విసిరారు. ఐదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆలోచనలు చూస్తే ఈ రాష్ట్రానికి మంచి నాయకుడు దొరికారన్న నమ్మకం కలిగిందని, మరో ముప్పై ఏళ్లు ఈ రాష్ట్రాన్ని నవశకం వైపు నడిపే నాయకుడు జగనే అని ప్రశంసించారు. ‘అమ్మఒడి’ పథకం ‘ఆరోగ్యశ్రీ’, ఫీజు రియింబర్స్ మెంట్ లాగా దేశంలోనే ఆదర్శంగా నిలబడుతుందని అన్నారు. 

Andhra Pradesh
Assembly
MLA
Roja
  • Loading...

More Telugu News