bhuvaneswar kumar: టీమిండియాకు షాక్.. మూడు మ్యాచ్ లకు భువీ దూరం

  • పాక్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డ భువీ
  • తొడ కండరాలు పట్టేయడంతో.. విశ్రాంతి
  • త్వరలోనే భువీ కోలుకుంటాడన్న కోహ్లీ

ప్రపంచకప్ లో భాగంగా దాయాది దేశం పాకిస్థాన్ పై నిన్న జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ లో ఘన విజయం సాధించిన టీమిండియాకు షాక్ తగిలింది. రానున్న మూడు మ్యాచ్ లకు కీలక బౌలర్ భువనేశ్వర్ కుమార్ దూరమయ్యాడు. పాక్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేస్తూ భువీ గాయపడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో, మైదానాన్ని విడిచి వెళ్లాడు. తొడ నరాలు గట్టిగా పట్టేయడంతో, ఆయనకు విశ్రాంతి అవసరమైంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్ లతో జరిగి మ్యాచ్ లకు భువీ దూరమయ్యాడు. జూన్ 30న ఇంగ్లండ్ తో జరిగే మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడో? లేదో? అనే విషయం ఇప్పటికిప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది.

ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ, త్వరలోనే భువీ కోలుకుంటాడనే ఆకాంక్షను వ్యక్తం చేశాడు. మరో ఫాస్ట్ బౌలర్ అవసరమైతే... షమీ అందుబాటులో ఉన్నాడని తెలిపాడు.

bhuvaneswar kumar
injury
kohli
team indai
  • Loading...

More Telugu News