kcr: కాసేపట్లో జగన్ తో భేటీ కానున్న కేసీఆర్

  • విజయవాడ చేరుకున్న కేసీఆర్
  • కాసేపట్లో తాడేపల్లిలోని జగన్ నివాసానికి పయనం
  • కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానం

ఏపీ సీఎం జగన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో భేటీ కానున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి కేసీఆర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో కేసీఆర్ కు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ లు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన కేసీఆర్ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి నేరుగా వెళ్లారు.

కాసేపట్లో తాడేపల్లిలోని జగన్ నివాసానికి కేసీఆర్ చేరుకోనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ ను ఆహ్వానించనున్నారు. సాయంత్రం 4 గంటలకు గేట్ వే హోటల్ కు వెళ్లి కాసేపు సేదతీరిన అనంతరం... సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి దీక్షా స్వీకరణ కార్యక్రమానికి హాజరవుతారు. రాత్రి 7.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాదుకు తిరుగుపయనమవుతారు.

kcr
jagan
vijayawada
kaleshwaram
  • Loading...

More Telugu News