Rishab Pant: పాక్ తో మ్యాచ్ వేళ... పంత్ తో కలిసి గోలగోల చేసిన జీవా వీడియో!

  • నిన్న మాంచెస్టర్ లో మ్యాచ్
  • జీవాతో కలిసి సందడి చేసిన పంత్
  • ఇన్ స్టాగ్రామ్ లో వీడియో

టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఎంత అల్లరి చేస్తాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక చిన్న పిల్లలను చూస్తే, ఇంకా రెచ్చిపోతాడు. నిన్న మాంచెస్టర్ లో పాకిస్థాన్ తో భారత్ మ్యాచ్ సందర్భంగా తుది జట్టులో స్థానం సంపాదించుకోలేక పోయిన రిషబ్ పంత్, మహేంద్ర సింగ్ ధోనీ కుమార్తె జీవాతో కలిసి గోలగోల చేశాడు. మ్యాచ్ జరుగుతున్న వేళ, వీరిద్దరూ కలిసి ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. ఆ వీడియోను పంత్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో అదిప్పుడు వైరల్ అయింది. కాగా, ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడటంతో, అతని స్థానంలో రిషబ్ బ్రిటన్ కు వెళ్లి జట్టులో చేరిన సంగతి తెలిసిందే.





View this post on Instagram









Partners in crime ? @ziva_singh_dhoni

A post shared by Rishabh Pant (@rishabpant) on

Rishab Pant
India
Pakistan
Cricket
Ziva
MS Dhoni
  • Loading...

More Telugu News