Srikakulam District: శ్రీకాకుళం మామిడి తోటల్లో వ్యభిచారం... పట్టుబడిన వారిలో అత్యధికులు కాలేజీ స్టూడెంట్స్!

  • జాతీయ రహదారి పక్కనే అసాంఘిక కార్యకలాపాలు
  • దాడులు చేసిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు
  • 20 మంది యువకులు, ముగ్గురు అమ్మాయిలు అరెస్ట్

శ్రీకాకుళం జిల్లా పరిధిలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న మామిడి తోటల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలుసుకుని దాడులకు వెళ్లిన పోలీసులకు పలువురు కాలేజీ స్టూడెంట్స్ పట్టుబడ్డారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు, నరసన్నపేట మండల పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారి ప్రక్కన వ్యబిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు శనివారం అర్థరాత్రి దాడులకు వెళ్లారు. అక్కడ వీరికి 20 మంది యువకులు, ముగ్గురు అమ్మాయిలు పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకున్నామని, పట్టుబడిన వారిలో ఎక్కువమంది కాలేజీ విద్యార్థులేనని పోలీసులు తెలిపారు. ముగ్గురు అమ్మాయిలూ రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన వారని తెలిపారు.

Srikakulam District
National Highway
Prostitution
Police
Arrest
  • Loading...

More Telugu News