PM modi: ప్రజాస్వామ్యంలో విపక్షం పాత్ర కీలకం...వారిని గౌరవిస్తాం : ప్రధాని మోదీ

  • వారి సంఖ్యా బలంతో సంబంధం లేదు
  • వారి ప్రాధాన్యం వారికి ఉంటుంది
  • అర్థవంతమైన చర్చతో సభ సంప్రదాయాన్ని కాపాడాలి

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర చాలా కీలకమని, వారి మాటను గౌరవిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సభలో వారి సంఖ్యాబలంతో సంబంధం లేకుండా విపక్షాల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. అయితే వారు కూడా అనవసర విమర్శలతో సభా సమయాన్ని వృథా చేయకుండా సద్వినియోగం అయ్యేలా సహకరించాలని కోరారు.

లోక్‌సభ సమావేశాలు ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా పనిచేయాలని, విలువైన సభా సమయాన్ని సద్వినియోగం చేయాలని సూచించారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి లోక్‌సభలో అత్యధిక మంది మహిళా ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దశాబ్దాల తర్వాత కేంద్రంలో ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చింది. అటువంటి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల సంక్షేమం కోసం మేము తీసుకునే నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని విపక్షాలను కోరుతున్నాను’ అని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News