AP legislative council: ఏపీ శాసన మండలి సమావేశాలకు హాజరైన ముఖ్యమంత్రి జగన్‌

  • తొలిసారి  సీఎం రాక
  • ఆయన వెంట మంత్రులు బొత్స, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌
  • పలువురు సభ్యులకు అభివాదం చేసిన జగన్

కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఏపీ శాసన మండలి సమావేశాలకు ఈరోజు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి హాజరయ్యారు. ముఖ్యమంత్రి, మంత్రులు  ఉభయ సభలకు హాజరై సభ్యుల ప్రశ్నలకు సమాధానం, వివరణ ఇవ్వడం సంప్రదాయం. ముఖ్యమంత్రి వెంట మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ఉన్నారు. సభకి హాజరైన ముఖ్యమంత్రి తొలుత టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌తో కరచాలనం చేశారు. అనంతరం పలువురు సభ్యులకు అభివాదం చేశారు. అలాగే టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ యనమల రామకృష్ణుడిని పలకరించారు.

AP legislative council
CM jagan
  • Loading...

More Telugu News