BJP: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బంపరాఫర్ ఇచ్చిన బీజేపీ!

  • రాజ్యసభ సభ్యుడిగా చాన్స్
  • తెలంగాణలో బలపడేందుకు బీజేపీ వ్యూహాలు
  • అధికారికంగా వెల్లడి కాని ప్రకటన

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వంపై తీవ్రమైన విమర్శలు చేసి, ఈ ఉదయం న్యూఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుసుకునేందుకు వెళ్లిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, ఆ పార్టీ పెద్దలు బంపరాఫర్ ను ఇచ్చినట్టు తెలుస్తోంది. మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని, బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తామని బీజేపీ స్పష్టం చేసినట్టు సమాచారం.

2024 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ, అందుకు వేస్తున్న వ్యూహాల్లో భాగంగా, ఇక్కడి నుంచి ఎంపీల సంఖ్యను పెంచుకోవాలని భావిస్తున్నట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. రాష్ట్రం నుంచి పార్లమెంట్ లో ప్రాతినిధ్యాన్ని పెంచితే, ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళ్లి, తదుపరి ఎన్నికల్లో లాభం కలుగుతుందని భావిస్తున్న బీజేపీ అధిష్ఠానం, ఈ మేరకు కోమటిరెడ్డికి రాజ్యసభ సభ్యుడి పదవిని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సివుంది.

BJP
Komatireddy Rajagopal Reddy
Rajya Sabha
Telangana
TRS
  • Loading...

More Telugu News