Andhra Pradesh: చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిఉండొచ్చు.. నేను మాత్రం ‘మందలగిరి పప్పు’ను కాదు!: మంత్రి అనిల్

  • టీడీపీ అధినేతపై మంత్రి అనిల్ విమర్శలు
  • తిప్పికొట్టిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు
  • తీవ్రంగా స్పందించిన జలవనరుల శాఖ మంత్రి

టీడీపీ ప్రభుత్వం తీవ్రమైన అవినీతికి పాల్పడిందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ఎలాంటి అనుభవం లేకపోయినా అదృష్టం కొద్దీ మంత్రి అయిన అనిల్ చంద్రబాబుకే ఇరిగేషన్ పాఠాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. దీంతో మంత్రి అనిల్ కుమార్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. ఈరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

అచ్చెన్నాయుడు విమర్శలపై అనిల్ స్పందిస్తూ..‘అధ్యక్షా.. నేను చంద్రబాబు కొడుకు లెక్కన నియోజకవర్గాన్ని పేరు పెట్టి కూడా పిలవలేక, మంగళగిరిని మందలగిరి అని చెప్పే పప్పును మాత్రం కాదు అధ్యక్షా. నేను డాక్టర్ ను. ఈ ఫీల్డ్ కు నేను కొత్త అయ్యుండొచ్చు. కానీ తొందరగానే నేర్చుకుంటాం. చంద్రబాబు గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అయ్యుండొచ్చు.

మేం కాదనడం లేదు. కానీ ఆయన అడ్డగోలుగా దోచుకుని తింటూ ఉంటే, తప్పులు చేస్తుంటే యువనేతలు మాట్లాడకూడదు, రాజకీయాల్లోకి రాకూడదు అన్న రీతిలో అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు అధ్యక్షా. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేక ఎమ్మెల్సీగా జాబ్ తీసుకున్న పప్పును మాత్రం నేను కాదు అధ్యక్షా’ అని విమర్శల వర్షం కురిపించారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
Nara Lokesh
YSRCP
anil kumar
irregation
  • Loading...

More Telugu News