Koteshwara Prasad: ఎన్టీఆర్ ని అంకుల్ అని పిలిచేవాడిని!: లక్ష్మీ పార్వతి తనయుడు డాక్టర్ కోటేశ్వర ప్రసాద్

  • ప్రస్తుతం వైద్యుడిగా సేవలందిస్తున్న కోటేశ్వర ప్రసాద్
  • ఎన్టీఆర్ ముందు పాట పాడితే అభినందించారు
  • 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో వాస్తవాన్నే చూపించారన్న ప్రసాద్

లక్ష్మీపార్వతికి ఓ కుమారుడు ఉన్నాడని, అతను ఓ డాక్టర్ అని చాలా మందికి తెలియదు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తరువాత మాత్రమే ఆమె గురించి అందరికీ తెలిసింది. ఆమె గత జీవితంలో వీరగంధం సుబ్బారావు అనే కళాకారుడి భార్యని, ఆయనకు విడాకులు ఇచ్చి, ఎన్టీఆర్ ను వివాహం చేసుకుందని తెలుసు.

కానీ, ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. తాజాగా ఓ వెబ్ చానెల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ను గుర్తు చేసుకున్న కోటేశ్వర ప్రసాద్, ఆయన్ను అంకుల్ అని పిలిచేవాడినన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను ఓ పాట పాడితే, ఎన్టీఆర్ అభినందించారని చెప్పారు.

రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో 99 శాతం నిజాలను చూపించారని అన్నారు. తనతో పాటు పనిచేసే వైద్యుల్లో చాలామందికి తాను లక్ష్మీపార్వతి కుమారుడినన్న విషయం తెలియదని అన్నారు. తాను చిన్నప్పుడు ఎక్కువకాలం మోహన్ బాబు ఇంట్లోనే పెరిగానని అన్నారు. కోటేశ్వర ప్రసాద్ ప్రత్యేక ఇంటర్వ్యూను మీరూ చూడవచ్చు.

Koteshwara Prasad
Lakshmis NTR
Lakshmi parvati
NTR
  • Error fetching data: Network response was not ok

More Telugu News