Andhra Pradesh: 75 ఎకరాలు జవాన్లకు ఇవ్వాలనుకున్నా.. ఆ భూముల పత్రాలు గల్లంతయ్యాయి!: నటుడు సుమన్
- ఆర్మీ, నేవీ, రక్షణశాఖ సిబ్బందికి ఇవ్వాలనుకున్నాం
- హైదరాబాద్-చెన్నై రాకపోకల్లో గల్లంతు అయ్యాయి
- జవాన్లకు చాలా తక్కువ జీతాలు వస్తున్నాయి
భారత ఆర్మీ, నేవి జవాన్లతో పాటు రక్షణశాఖ సిబ్బందికి 75 ఎకరాల భూమిని విరాళంగా ఇవ్వాలని ప్రముఖ నటుడు సుమన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సుమన్ ఈ వ్యవహారంపై స్పందించారు. తాను ఉద్యోగులకు విరాళంగా ఇవ్వాలనుకున్న భూముల పత్రాలు గల్లంతు అయ్యాయని సుమన్ తెలిపారు. చెన్నై, హైదరాబాద్ కు రాకపోకల సందర్భంగా ఎక్కడో ఈ పత్రాలు గల్లంతు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
డబుల్ రిజిస్ట్రేషన్ కారణంగా ఆ భూములపై కోర్టులో కేసు కొనసాగుతోందని చెప్పారు. జవాన్ల కోసం కేటాయించిన భూమి కోసం సుప్రీంకోర్టు వరకూ వెళ్లయినా పోరాడుతానని స్పష్టం చేశారు. ఆర్మీ, నేవి, రక్షణశాఖలోని ఉద్యోగులకు చాలా తక్కువ జీతాలు వస్తున్నాయని సుమన్ తెలిపారు.
అందుకే తన వంతుగా దేశం కోసం సేవ చేస్తున్నవారికి సాయం చేయాలనుకుంటున్నానని చెప్పారు. తమ కుటుంబం భువనగిరిలో 175 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందనీ, ఇందులో తొలుత ఆయుర్వేదిక్ రిసార్ట్స్ కట్టాలని అనుకున్నామన్నారు. కానీ చివరికి ఇందులో 75 ఎకరాలను జవాన్లకు విరాళంగా ఇవ్వాలనుకున్నామని చెప్పారు.