Sri Reddy: మరో హీరోను టార్గెట్ చేసుకున్న శ్రీరెడ్డి!

  • కేస్టింగ్ కౌచ్ ఆరోపణలతో గతంలో సంచలనం
  • ప్రస్తుతం చెన్నైలో మకాం వేసిన శ్రీరెడ్డి
  • తాజాగా విశాల్ పై విమర్శలు

టాలీవుడ్ లో కేస్టింగ్ కౌచ్ భూతాన్ని ప్రపంచానికి తెలియజెప్పి సంచలనం రేపిన నటి శ్రీరెడ్డి, హైదరాబాద్ ను వదిలి, ప్రస్తుతం చెన్నైలో మకాం వేసిన సంగతి తెలిసిందే. చెన్నైలోనూ, ఏఆర్‌ మురుగదాస్, లారెన్స్‌ వంటి ప్రముఖులపై లైంగిక ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి, తాజాగా విశాల్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించింది.

ఇంకో వారం రోజుల్లో నడిగర్ సంఘం ఎన్నికలు జరుగనుండగా, బరిలో ఉన్న విశాల్, శరత్ కుమార్ ప్యానల్స్ మధ్య ఇప్పటికే విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతుండగా, తాజాగా, శ్రీరెడ్డి కూడా విమర్శలు మొదలెట్టింది. ఎటువంటి కారణాలు లేకుండానే, ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో విశాల్ ను టార్గెట్ చేసుకుంది. ఆయనపై పలు రకాల విమర్శలు చేసింది. ఇటీవల కొంతకాలం పాటు సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి, ఇతర ప్రముఖ హీరోయిన్లపై విమర్శల దాడి చేయడం ద్వారా తిరిగి వార్తల్లోకి వచ్చింది. 

Sri Reddy
Vishal
Kollywood
Nadigar Sangham
Elections
  • Loading...

More Telugu News